Posts

మా గొప్ప దేవుడు

Image
 శ్రీ శ్రీ శ్రీ హజరత్ వన్నూరు స్వామి తాత పుట్టుపూర్వోత్తరాల గురించి ఈ తరానికి తెలియజేయాలని నా ఓ చిన్న తాపత్రయంతో మీ ముందుకు తీసుకొచ్చాను. పూర్తిగా చదివి పది మందికి తెలియజేయాలని మనఃపూర్వకముగా కోరుకుంటూ కాదు కాదు ఆశిస్తూ... 🙏          🙏నా కలానికి శక్తినివ్వు తాత🙏 శ్రీ శ్రీ శ్రీ హజరత్ వన్నూరు తాత గొప్ప మహిమగల్లా తాత. కరివేముల గ్రామానికి, గ్రామ ప్రజలకు నేనున్నానని కోరిన కోర్కెలన్నీ కొంగు బంగారమల్లే కష్టాల్ని, కన్నీళ్లను మహిమగల తాత భరించి సుఖసంతోషాలనందించిన మా ఊరి దేవుడు, మాగొప్ప దేవుడు... 🙏 దేవుడంటే విశ్వం, విశ్వమంటేనే దేవుడని పాంథీయిజంలో నాస్తికులకు నొక్కి పెట్టి మరీ అస్తిత్వాన్ని ఋజువుచేసింది "పాంథీయిజం". మనం డైవర్ట్ అవ్వకుండా టాపిక్ లోకి వచ్చేద్దాం. ఎందుకంటే! ఏళ్ల తరబడి వాదించినా అది ఒడవని ముచ్చట గనుక. గందుకే మనం మన టాపిక్ లోనే పరకాయ ప్రవేశం చేద్దాం. ఎక్కడున్నాం మనం ఆ...దేవుడంటేనే జీవుడు, జీవాన్ని సృష్టించేవాడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడనీ...        ఇప్పుడు శ్రీ శ్రీ శ్రీ హజరత్ వన్నూరు స్వామి తాత నిజ జీవితంలోకి వెళ్దాం..!  ...

డా"బి. ఆర్. అంబేద్కర్..!

Image
 👉 అందరికీ నమస్సులతో భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన భారతరత్న డాక్టర్. బిఆర్. అంబేద్కర్ గారిని స్మరించుకోవడమే కాదు, ఆ మహనీయుడి ఆశయాలను ఆచరించాల్సిన బాధ్యత కూడా మనందరిది... 🙏 ప్రపంచ దేశాలు గర్వించే విధంగా వున్న మన రాజ్యాంగం "అమల్లోకి వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా" భారతదేశ రాజ్యాంగ వారసులందరికీ భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కూడా లేకపోవడం మన దౌర్భాగ్యం...  రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 ఏళ్ళు అవుతున్న సందర్బంగా నేను మీకు ఒక విషయం లో క్లారిటీ ఇవ్వదల్చుకున్నాను... 👉 ఒకడేమో భగవద్గీత చదువు నా దేవుడి విలువ ఎంతో తెలుస్తుంది అంటాడు... 👉 ఇంకొకడు నా ఖురాన్ చదువు నా దేవుడి విలువ ఏంటో తెలుస్తుంది అంటాడు... 👉 మరొకడు నా బైబిల్ చదువు నా దేవుడి విలువ ఎంతో తెలుస్తుంది అంటాడు...    కానీ నేనంటాను...!  అంబేద్కర్ విలువ తెలియాలంటే... బైబిల్, ఖురాన్, భగవద్గీత చదవడం కాదు,  "రాజ్యాంగం" చదవమంటాను... 🙏 👉 రాజ్యాంగం రాకముందు మాలోడింట్ల మాలోడే పుట్టేవాడు,  మాదిగోడింట్ల మాదిగోడే పుట్టేవాడు,  కుమ్మరోడింట్ల కుమ్మరోడే పుట్టేవాడు...  👉కానీ రాజ్యాంగం వచ్చిన తర్వా...

"అన్నింటికన్నా ప్రమాదకరం" ఏంటంటే..!

Image
         నా హృదయాంతరంగంలోని మనోవేదన..!  నా దృష్టిలో ఈ జగత్తులో "అన్నింటికన్నా ప్రమాదకరం" ఏదంటే..? అన్నింటికన్నా ప్రమాదకరం శ్రమ దోపిడీ కాదు,  పోలీసుల లాఠీ దెబ్బలు కావు,  దేశద్రోహం,  లంచగొండితనం కానే కావు...  నేరం చేయకుండా పట్టుబడడం విషాదమే,  ప్రశ్నించే గొంతుకైనా భయంతో నోరు మూసుకోవడం తప్పే,  కానీ అవేవీ ప్రమాదకరం కావు నా దృష్టిలో...  మోసాల హోరులో నిజాయితీ  గొంతు అణగిపోవడం  అన్యాయమే,  మిణుగురుల వెలుగుల్లో చదువుకోవడం తప్పే, పిడికిళ్లు బిగించి కాలం గడిపేయడం సరికాదు, కానీ నా దృష్టిలో అన్నింటికన్నా ప్రమాదకరం మాత్రం కాదు... 👉"నా స్ఫూర్తి ప్రదాత" అన్నింటికన్నా ప్రమాదకరం జీవత్సవంలా ఉండిపోవడం, దేనికి తల్లడిల్లకుండా అన్నీ భరించడం, ఏమీ జరగనట్టు మన కలలు మరణించడం అన్నింటికన్నా ప్రమాదకరం...  మన చేతికున్నా గడియారం పని చేస్తున్నా మన దృష్టికి అది ఆగిపోయినట్టు కనిపించడం అత్యంత ప్రమాదకరం...  అన్నీ చూస్తూ కూడా నిశ్చలంగా ఉన్నట్టుండే కన్ను,  ప్రపంచాన్ని ప్రేమగా చంబించడం మర్చిపోయిన ఆ చూపు, చర్మం చివరి అంచుల నుంచి వెలు...

మా ఊరి మంచినీళ్ల బావి..!

Image
               మా ఊరి మంచినీళ్ల బావి ఓ లోతైన దిగుడు బావి. ఊరందరికీ దాహం తీర్చే దిగులు లేని బావి. రోళ్లు పగిలే రోహిణి కార్తెలోనూ మా ఊరి మంచినీళ్ల బావి జల కలిమితో భూమి పొరల్లోంచి ఊటతో నీటలక్ష్మీ నివాసంలా ఉండేది. ప్రతి ఇంటింటిలో దిగుడు బావిలోని నీటలక్ష్మీ పొంగి పొర్లేది. పోనుపోనూ రోజులు గడిచే కొద్ది మంచినీళ్ల బావిలో కల్మషం లేని స్వచ్ఛమైన నీటలక్ష్మీని కలుషితం చేసి మలినం చేశారు. ఆ మలినం వల్ల ఊరి జనాలకు "నారపుండ్లు" అవ్వడం వల్ల జనాలంతా భయాందోళనకు గురయ్యారు. మంచినీళ్ల బావి కలుషితం వల్లే ఈ "నారపుండ్లు" ఏర్పడ్డాయని ప్రజలంతా అప్రమత్తం అవ్వడం గమనార్హం. అప్పటి పెద్దల మేధాశక్తి ఇప్పటి వందల శాస్త్రవేత్తలతో సమానం. ఎట్టకేలకు ఊరి పెద్ద మనిషి రెడ్డి స్థానంలో ఉండి గొప్ప మనసుతో నారపుండ్ల నుండి ప్రజలకు విముక్తిని కలిగించి అంతటి లోతైన దిగుడు బావిని కాస్త సేదర బావిగా గిలకల సహాయంతో నీటిని తోడుకునేలా ఏర్పరచిన మహానుభావుడు "చిన్న రెడ్డి అలియాస్ విష్ణు వర్ధన రెడ్డి". రెడ్డి మనసు వెన్నా, జనుల మంచిని కోరే మనసులో మిన్నా... పెళ్లి పిలుపో, తప్పిపోయిన కట్టుగొయ్యలు వెతుక్కుంటూనో ఎం...

పల్లెటూరి టేలర్..!

Image
 👉 చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఓ జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటూ రాశాను కాస్త ఓపిగ్గా చదవండి... 🙏 మనం చిన్నప్పుడు ఇబ్బంది పడుతూ లోలోనే కుమిలి ఎవరికీ చెప్పుకోలేని బాధల్లో ఒకటి కొత్త బట్టలు కుట్టించుకోవడం. ఒక అంగీ(చొక్కా), లాగు(నిక్కర్) కుట్టించుకోడానికి పడిన నానా తంటాలు... మన ఊరి టేలర్ దగ్గర అంగీ, నిక్కర్ కుట్టించుకోవడంలో నా అనుభవం... నా చిన్నప్పుడు ఊరి మొత్తానికి పేరున్న టేలర్ నన్నబుడ్డీ (నాకు మామ వరుస). పల్లెటూళ్లంటే తెలుసుగా ఏ కులం, మతం అంటూ పట్టింపులు లేకుండా కల్మషం లేకుండా బంధాలతో కలుపుకోవడం... మా ఊరి మొత్తానికి మబ్దుల్ అనే ఒకతని దగ్గర బట్టల్ని కొనుగోలు చేసి నన్నబుడ్డీ అనే వ్యక్తి దగ్గర కుట్టించుకోవడం. మబ్దుల్ అనే పెద్దమనిషి మనుషుల రంగుల్ని బట్టి బట్టల రంగుల్ని కట్ చేసి ఇచ్చేవాడు. మనుషుల్ని దగ్గర చేసుకుని వ్యాపారం చేసుకోవడం ఈయన ఆనవాయితీ. మనుషుల్ని అసలు దూరం చేసుకోడు. డబ్బులు లేకపోయినా ఖాతాలో రాసుకుని గుడ్డలు ఇచ్చేటోడు. మనుషుల్ని ఆప్యాయంగా పలకరించడంలో మబ్దుల్ దిట్ట అనుకోండి. ఇప్పటికీ వారానికి రెండు సార్లు మన ఊరికి వచ్చి బట్టల వ్యాపారం చేస్తుంటాడు. ఈ బట్టలు చించిచ్చే మబ్దుల్ గారున్నారే భ...

క్షరకుడి చేతిలో నా అగచాట్లు..!

Image
 అందరికీ హృదయపూర్వక నమస్తే... 🙏     మన పుట్టెంట్రుకలు తీసే దగ్గర్నుంచి, పాడెక్కే వరకు ప్రతి ఒక్కరికీ తలవెంట్రుకలు పెరిగితే అదేనండీ కట్టింగ్ పెరిగితే మంగళి షాపుకెళ్లి కట్టింగ్ చేయించుకునేటప్పుడు పడే తంటాలేంటో అందులో నేను పడిన ఘోషేంటో మీకు చెప్దామని వచ్చానండోయ్... మాదొక గ్రామం, పేరు కరివేముల(కర్నూలు జిల్లాలో ఓ గ్రామం). ఏం చూసి ఊరి పేరు కరివేముల అని పెట్టారో తెలీదు కానండీ మా ఊరికి మాత్రం ఏనుగులంతటి బలముండేడిదటా. ఓసారి కూసింత ఎనక్కెళ్లి మా ఊరి పేరులోని ముందు రెండు అక్షరాలను గమనించండి మీకే అర్ధమవుతుంది ఎంచ్చక్కా... ఇక అసలు విషయానికొస్తే మా ఊళ్లో నాయి బ్రాహ్మణుల(మంగళొళ్ల) దండు పెద్దదేనండోయ్. ఆరుగురో, ఏడుగురో అందరూ అన్నదమ్ముల వరుసైనా, ఇద్దరేమో ఆడపిల్ల కొడుకులుండబట్టి ఊళ్లోనే అలా వరుసైన వాళ్లు కూడా రెండు కుటుంబాలున్నాయన్నమాట. ఇలా వాళ్లు, వాళ్లవాళ్ల బిడ్డలు ఇలా చాలా గుంపే ఉంది... ఈ నాయీ బ్రాహ్మణులు మాత్రం సన్నాయి, డోలు వాయిస్తూ మా ఊరికి మంచి పేరే తీసుకొచ్చారనుకోండి. సన్నాయి, డోలు మాత్రమే కాదండోయ్. క్రీ. పూ. 6వ శతాబ్దంలో ఆయుర్వేద శాస్త్రానికి శుశృతుడు గుండెకాయ అయితే చరతుడు వెన్నెమ...

ఓ రోజు రాత్రి..!

Image
 👉 ఓ రోజు రాత్రి మోహం చల్లారి ఆలోచనలతో సతమతమవుతున్న వేళ..! అనుకోని అతిథి నువ్వు చిత్రకారుడివి కదా..? నేను:- అబ్బే లేదండీ కాకపోతే ఏదో చిన్నపాటి చిత్రకారుడిని లోలోపల చిరునవ్వుతో. అమ్మాయి:- అయితే అద్దంలో అందాన్ని చూపిస్తూ నా హృదయం బొమ్మ గీసిస్తావా..? నేను:- మీ హృదయం చూడలేదు కదండీ. కానీ, హృదయం బొమ్మ అయితే గీయగలనండోయ్. అమ్మాయి:- గీసిన తర్వాత చూసి ఇంత చిన్నదా నా హృదయం, చివర్లేంటి తెలిపేను హృదయం నీకు సొంతమనీ..? నేను:- మాటరాక ఒక్క నిమిషం చిత్తరువై కునుకు తీస్తున్నా రాత్రి కలలో... 🤷‍♂️🙆‍♂️                         *ప్రేమతో మీ*,                       వన్నూర్... ✍️❤️