"అన్నింటికన్నా ప్రమాదకరం" ఏంటంటే..!
నా హృదయాంతరంగంలోని మనోవేదన..!
నా దృష్టిలో ఈ జగత్తులో "అన్నింటికన్నా ప్రమాదకరం" ఏదంటే..?
అన్నింటికన్నా ప్రమాదకరం శ్రమ దోపిడీ కాదు,
పోలీసుల లాఠీ దెబ్బలు కావు,
దేశద్రోహం,
లంచగొండితనం కానే కావు...
నేరం చేయకుండా పట్టుబడడం విషాదమే,
ప్రశ్నించే గొంతుకైనా భయంతో నోరు మూసుకోవడం తప్పే,
కానీ అవేవీ ప్రమాదకరం కావు నా దృష్టిలో...
మోసాల హోరులో నిజాయితీ
గొంతు అణగిపోవడం అన్యాయమే,
మిణుగురుల వెలుగుల్లో చదువుకోవడం తప్పే,
పిడికిళ్లు బిగించి కాలం గడిపేయడం సరికాదు,
కానీ నా దృష్టిలో అన్నింటికన్నా ప్రమాదకరం మాత్రం కాదు...
![]() |
| 👉"నా స్ఫూర్తి ప్రదాత" |
అన్నింటికన్నా ప్రమాదకరం జీవత్సవంలా ఉండిపోవడం,
దేనికి తల్లడిల్లకుండా అన్నీ భరించడం,
ఏమీ జరగనట్టు
మన కలలు మరణించడం అన్నింటికన్నా ప్రమాదకరం...
మన చేతికున్నా గడియారం పని చేస్తున్నా
మన దృష్టికి అది ఆగిపోయినట్టు కనిపించడం అత్యంత ప్రమాదకరం...
అన్నీ చూస్తూ కూడా నిశ్చలంగా ఉన్నట్టుండే కన్ను,
ప్రపంచాన్ని ప్రేమగా చంబించడం మర్చిపోయిన ఆ చూపు,
చర్మం చివరి అంచుల నుంచి వెలువడే శ్వేధ గ్రంథుల ఆవిరి మీద జారిపోయే ఆ చూపు,
లక్ష్యాన్ని మరిచేలా అయోమయంలో దారి తప్పిన జీవితం,
బతికున్న ఆత్మల ఆకాశంలో పొద్దువాలే రాత్రి,
శాశ్వతంగా మూసుకున్న తలుపులకీ, గడపలకీ అతుక్కుని గుడ్లగూబలు, నక్కలూ అరిచే రాత్రులు ,
ఆత్మ సూర్యుడిలా అస్తమించే ఆ దిక్కు నుండి అస్తమైపోవడం "అన్నింటికన్నా ప్రమాదకరం"...🙏
మీ,
వన్నూరప్ప... ✍️

Comments
Post a Comment